తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సూపర్ హిట్ జోడీలు ఉన్నాయి. వారి కాంబినేషన్ లో ఏ మూవీ వచ్చిన ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. వెంకటేష్ మీనా వీళ్ళు ఇద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 1990 ల ప్రారంభంలో వీళ్ళు ఇద్దరికీ మంచి డిమాండ్ ఉండేది. చంటి సినిమాతో ఈ పెయిర్ కి తమిళనాడులో కూడా డిమాండ్ వచ్చింది. సుందరాకాండ, అబ్బాయి గారు వంటి సినిమాలతో అలరించారు.