పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పాపపేరు సనూషా సంతోష్. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సనూషా సంతోష్ బంగారం సినిమా కంటే ముందే, పలు మలయాళ సినిమా ల్లో నటించింది. తన ఐదు సంవత్సరాల వయసు నుంచే నట జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మాయి, మొట్టమొదటిగా ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ చిత్రంలో బాగా అలరించింది. అంతేకాక పలు సినిమాలలో చిన్న వయసులోనే ఉత్తమ బాల నటిగా అవార్డు కూడా తెచ్చుకుంది . ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైనా, కొద్దిరోజులకు ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన జీనియస్ చిత్రం ద్వారా హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాలో కూడా జర్నలిస్ట్ పాత్రలో నటించింది..