తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగ్రేటం చేసిన అల్లు అర్జున్ వరుస సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ఓ వైపు అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించడంతో దాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.