నిజానికి ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుండి బడా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన దిల్ రాజు సినిమా వ్యాపారంలో ఆందెవేసిన చేయిగా మారిపోయాడు. ఇక తమిళం, కన్నడం మలయాళంలో కూడా ఈ సినిమా ను యంగ్ హీరోలతో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంత లేదన్నా ఈ నాలుగు భాషల సినిమాల విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా.