దాదాపు నాలుగు వందల యాబై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతోన్న RRR సినిమాకు ఉన్న క్రేజ్ ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ కేక పెట్టిస్తుంది. కేవలం థియేట్రికల్ బిజినెస్ వరకే ఐదు వందల కోట్ల రూపాయలను దాటించాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇంత క్రేజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు కొత్త తలనొప్పులు ఎదురయ్యాయట.