నాగార్జున హీరోగా చేయనున్న బంగార్రాజు సినిమాని సంక్రాంతి సందర్భంగా 2022 వ సంవత్సరంలో విడుదల చేయనున్నారు. కాగా అదే పండుగ సందర్భంగా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట.. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో లో వస్తున్న విరూపాక్ష సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో వారిద్దరితో నాగార్జున పోటీ పడబోతున్నారని తెలుస్తోంది.