యాక్షన్ హీరో, మాస్ స్టార్ అని పేరు ప్రఖ్యాతులు పొందిన గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ " సీటీ మార్" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.. దీంతో ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా నుండి టైటిల్ ను ఒక సాంగ్ ను సమంత విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను వరం రేవంత్, అనురాగ్ కులకర్ణి పాడారు. విడుదలైన తర్వాత ఈ పాటలు సోషల్ మీడియా తో పాటు నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ చిత్రం భారీ సక్సెస్ ను అందుకుంటే గోపీచంద్ కు సమంత లక్కీ హ్యాండ్ గా మారినట్టే...