ఆఖరికి సినిమా డైరెక్టర్ ని కూడా వదలలేదు కేటుగాళ్లు. ఆ డైరెక్టర్ ను బాగా నమ్మించి చివరికి మోసం చేశారు. నితిన్ కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ సినిమా పేరు చెప్పి, ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకు సైబర్ నేరగాళ్లు టోకరా వేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. గడిచిన సోమవారం దర్శకుడు వెంకీ సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.