అనసూయ అంటే ట్రోలింగ్‌కు కేరాఫ్ అడ్రస్. ఇలా స్పెషల్ సాంగ్‌లో అనసూయ రెచ్చిపోయి కనిపించడంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే వీటిలో ఓ నెటిజన్ మాత్రం అనసూయకు మద్దుతగా ఓ కామెంట్ చేశాడు. దానిపై అనసూయ రియాక్ట్ అయింది.తెలుగు వాళ్లకు ఎటువంటి అవకాశాలు ఇవ్వక పోగా తప్పుగా తిడతారు.. ఇలా మాట్లాడితే తెలుగు వాళ్లు ఇండస్ట్రీకి రావాలంటే భయపడతారు.. మారండి కొంచమైనా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అతని కామెంట్ చూసిన అను కాస్త ఎమోషనల్ అయ్యింది.కామెంట్‌ను రౌండప్ చేసి.. ఇలాంటి కామెంట్లు చూసినప్పుడే అంతా మంచి జరుగుతుందనే ఆశ కలుగుతుంది.. అందుకే మంచి జరిగే వరకు ప్రయత్నాన్ని వదలను.. ఇలాంటివి ధైర్యంగా చెప్పే హృదయం, గట్స్ ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.