చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలను యదార్ధ జీవితాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తారు. ఇక ఆ నలుగురు” సినిమా నిజానికి ఒక రియల్ స్టోరీ. మదనపల్లి దగ్గర ఓ వ్యక్తి దహన సంస్కారాలకు డైరెక్టర్ మదన్ హాజరు అయ్యారు. ఊరంతా అప్పులు చేసిన ఆ వ్యక్తి గురించి ఆ ఊరంతా ప్రశంసిస్తోంది. అతని అప్పుల గురించి కాకుండా.. అతని మంచితనం గురించి మాట్లాడడం మదన్ చూసి చలించిపోయాడు.