రామ్ రెడ్ సినిమాలో తాను చేసిన తప్పులను గుర్తించి ఇక రీమేక్ సినిమాల జోలికి వెళ్లకుండా స్ట్రెయిట్ ఫిలిమ్స్ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రామ్.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై లింగు స్వామి దర్శకత్వంలో ఓ స్ట్రైట్ కోలీవుడ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటించనున్నారు.