ఆర్ఆర్ఆర్ సంబంధించిన షూటింగ్ ఇంకా లొకేషన్ లలో జరుగుతూనే ఉంది. షూటింగ్ పనులు పూర్తయ్యే సరికి కనీసం నాలుగైదు నెలలు పడుతుందని తెలుస్తోంది. షూటింగ్ ముగిసిన తర్వాత సినిమాకు సంబంధించిన సన్నివేశాలు యొక్క విజువల్ ఎఫెక్ట్స్ కూడా పూర్తిచేయాల్సి ఉంది. ఐతే రాజమౌళి ఔట్ పుట్ విషయం లో ఏమాత్రం కాంప్రమైజ్ కారు కాబట్టి సినిమా సంబంధిత పనులన్నీ అక్టోబర్ 13వ తేదీ నాటికి పూర్తవుతాయా అనే సందేహం వ్యక్తమవుతోంది.