సోషల్ మీడియాలో నాపై పిచ్చిరాతలు రాస్తున్నారు. నాకు పవన్‌కల్యాణ్‌గారు దేవుడితో సమానం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. అభిమానం అంటే ఎప్పటికైనా అభిమానమే.. దాన్ని వేరేలా ఆపాదిస్తూ పిచ్చి రాతలు రాస్తున్నారు. అదైతే మంచిది కాదు. సానుకూలతను పంచాల్సిన వాళ్లే చెడును విస్తరిస్తూ వేరేవాళ్ల పేరును బదనాం చేస్తూ రాయడం సరైంది కాదు. దీని వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి వాటి వల్ల పవన్‌కల్యాణ్‌గారు తన అభిమానులను కలవాలంటేనే ఆలోచించే స్థితికి తీసుకెళుతున్నారు. నిజానికి ఇలాంటి వార్తలపై స్పందించకూడదు. కానీ.. నాకు ఓపిక నశించి ఈ వీడియో చేస్తున్నా అభిమాని అంటే అలానే ఉండాలి.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అషూరెడ్డి.