సుద్దాల అశోక్‌తేజ మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. అందులో ఆయన చేసిన కామెంట్లు విమర్శలకు తావిస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే.. “ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఓ ప్రమాదం ఉంది.. వాళ్లు ఒక ధోరణిలో రాస్తారు.. వాళ్లు చదువుకున్నవాళ్లు కాదు.. వాళ్లకు ప్రత్యేకమైన అకడమిక్ డిగ్రీలుండవ్.. ’’ అంటున్నారు. ఇప్పుడు ఇది విమర్శల పాలవుతోంది.