నాగ్ అశ్విన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రభాస్ గురించి మాట్లాడారు. ప్రభాస్ దగ్గర ఫోన్ ఉన్నట్టు తనకు ఎప్పుడూ కనిపించలేదని నాగ్ అశ్విన్ బాంబు పేల్చారు. కనీసం తామిద్దరూ మాట్లాడుతున్న సమయంలో కూడా ఫోన్ రింగ్ అయినట్టు తనకు ఎప్పుడూ వినిపించ లేదని నాగ్ అశ్విన్ చెప్పారు. ప్రభాస్ చాలా తక్కువగా ఫోన్ వినియోగిస్తారని.. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చి హ్యాపీ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారని సన్నిహితులు చెబుతుంటారు.