మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, "మార్పు నీతోనే మొదలవ్వాలని" మహిళలందరూ పిలుపునిస్తోంది అక్కినేని వారి కోడలు సమంత.ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమంతా మహిళలను ఉద్దేశించి, ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని షేర్ చేసింది..తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మహిళల కోసం ఆమె మాట్లాడుతూ.. " మన స్థాయి ఏంటో..? విలువ ఏంటో..? తెలుసుకొనే సందర్భం వచ్చింది. మన అర్హతకు తక్కువగా ఉండాల్సిన అవసరం లేదు.. మనమేంటో..? మన స్థాయి ఏంటో..? నిరూపించుకోవాలి. ఏ ఒక్క మహిళ తనను తాను కించ పరుచుకోకుండా ఉండాలి.. నేను కూడా నన్ను నేను మరింత నమ్మాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలెంజ్ చేసుకుంటున్నాను.. మిమ్మల్ని కూడా చాలెంజ్ చేయమని అడుగుతున్నాను.. నీ నుంచే సాధికారత రావాలి . ఆ మార్పు నీతోనే మొదలవ్వాలి.. అని సమంత పేర్కొన్నది.