ఇటీవల విడుదలైన పవర్ ప్లే సినిమాలో పూర్ణ సీఎం కూతురు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతున్నారు. చాలా అందంగా, అమాయకంగా కనిపించే పూర్ణ ఈ సినిమాలో నెగటివ్ పాత్రను చాలా చక్కగా పోషించి తనలోని అద్భుతమైన నటనా ప్రతిభను ప్రదర్శించారు. నిజానికి ఈ సినిమా ఫ్లాప్ అయినా ఆమెకు మాత్రం కెరీర్ పరంగా మేలే చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వస్తున్నాయని సినీ వర్గాల సమాచారం.