హైదరాబాద్ అమ్మాయి, ఎన్నారై పెళ్ళికొడుకు మధ్య చోటు చేసుకునే రొమాన్స్ నేపథ్యంలో కొనసాగిన షాదీ ముబారక్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో అఖిల్ అక్కినేని ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే తాను నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా సేమ్ కాన్సెప్టు ఉందట. ఆ కాన్సెప్టు తో వచ్చిన షాదీ ముబారక్ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కాబట్టి అదే కాన్సెప్ట్ తమ సినిమాలో అసలు ఉండకూడదని అఖిల్ భావిస్తున్నారు.