తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లి చూపులు సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకు, తరుణ్ భాస్కర్ కి స్టార్ డాం వచ్చింది. అంతేకాదు.. జాతీయ స్థాయిలో కూడా అవార్డు తెచ్చుకున్న మూవీగా పెళ్లి చూపులు నిల్చింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీలో యంగ్ హీరోయిన్ రీతు వర్మ నటించింది.