చిత్ర పరిశ్రమలో హారాలు సినిమాలు చేస్తేనే ఇతర బిజినెస్ లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు, సినిమా రంగంలో ఉంటూనే వాళ్ల ఆసక్తి కారణంగా, లేదా ఇంకా ఏదైనా కారణంతో మరొక రంగంలో కూడా అడుగు పెట్టారు. ఎప్పటికైనా క్రేజ్ ఉండే వాటిలో ఫుడ్ ఒకటి. మన సెలబ్రిటీలలో చాలా మంది ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇందులో కొంత మందికి ఇండివిడ్యువల్ గా బిజినెస్ ఉంటే, ఇంకొంతమంది పార్ట్నర్ షిప్ లో బిజినెస్ లో ఉన్నారు.