దాసరి నారాయణ రావు పూలన్ దేవిని స్ఫూర్తి గా తీసుకొని ఒక కథను రాసుకొని, సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నాడు.. అయితే ఇదే కథను ఆర్ నారాయణ మూర్తి తో చెబితే, తెలంగాణ నేపథ్యంలో రాయమని సలహా ఇచ్చాడు. ఇక తెలంగాణ నేపథ్యంలో కథ రాసుకొని దాసరి నారాయణరావు తెరకెక్కించాడు. ఈ సినిమాలో రాములమ్మ పాత్రకు విజయశాంతి ని తీసుకున్నాడు.చిత్రంలో నటించినందుకు గాను విజయశాంతికి నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డ్ కూడా లభించింది. ఏకంగా 10 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయి, టాప్ ఫైవ్ లో ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా బయట ప్రజలు ఎప్పుడైనా రామిరెడ్డి ని, అశోక్ కుమార్ ల ను చూసినప్పుడల్లా విపరీతంగా తిట్టేవారు. అంతలా విలనిజాన్ని పండించారు ఆ ఇద్దరూ.. ఎంతైనా ఈ చిత్రానికి మాత్రం జోహార్లు కట్టాల్సిందే కదూ..!