అధిక వేడి కారణంగా చిరంజీవి డీహైడ్రేషన్‌కు గురయ్యారు.దాంతో, మూడ్రోజుల్లోనే షూటింగ్‌ను ముగించేసిన చిత్ర యూనిట్ హైదరాబాద్ రిటర్న్ అయ్యింది.ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాక మళ్లీ షూటింగ్ కొనసాగించే అవకాశం కనిపిస్తోం దని నిన్న వార్తలు వచ్చాయి.. అయితే ఆయన ప్రస్తుతం తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎక్కువ ఎండ, వేడి, షూటింగ్ లైట్స్ మద్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందని అంటున్నారు..ఈ మేరకు సినిమా షూటింగ్ ఈ నెల ఆఖరు వరకు వాయిదా వేస్తున్నట్లు సమాచారం.దీంతో సినిమా విడుదల కూడా వాయిదా పడినట్లే.. ఆయన త్వరగా కోలుకోవాలని మెగాభిమానులు ఆకాంక్షిస్తున్నారు..