ఖమ్మం లో నాలుగు రోజుల సమయం లో ఆచార్య సినిమాకు సంబంధించిన మేజర్ పోర్షన్ చిత్రీకరించాలని దర్శకుడు కొరటాల శివ అనుకున్నారు. కానీ చిరంజీవి హెల్త్ పాడవడంతో షూటింగ్ ని వచ్చే వారానికి వాయిదా వేశారు. మెగా స్టార్ హెల్త్ కుదుటపడేంతవరకు సినిమా షూటింగ్ ని నిలిపివేయాలని కొరటాల శివ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆచార్య సినిమా మే 14వ తేదీన విడుదల కావడం లేదని సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి.