వకీల్ సాబ్ సినిమా నుండి తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో మొదటిసారి నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళలని రివీల్ చేశారు. బాలీవుడ్లో కథ మొత్తం తాప్సీతో పాటు మరో ఇద్దరమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. మరి తెలుగులో చేసిన మార్పులతో ముగ్గురు అమ్మాయిల కంటే పవన్ కళ్యాణ్ హీరోయిజమే ఎక్కువగా హైలెట్ చేయబోతునట్టు తాజా పోస్టర్ గమనిస్తే అర్థమవుతోంది.