ప్రస్తుతం సుకుమార్ తో కలిసి పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ అనంతరం కొరటాల శివతో కలిసి మరో మూవీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ని లైన్ లో పెట్టి నట్లు తెలుస్తోంది. అయితే ఆయన స్టార్ డైరెక్టర్లతో సినిమాలు వరుసగా చేస్తుండటంతో మిగతా హీరోల అభిమానులు ఈర్ష భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అభిమానులని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.