తాజాగా విడుదలైన నితిన్ నటించిన చెక్ సినిమాతో బాగా జోష్లో వున్న నితిన్, గురించి హర్షవర్ధన్ ఒక ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఒక సినిమా ప్రొడ్యూసర్ కొడుకైన నితిన్ ఒక సినిమాని ఒప్పుకున్నాడు. ఆ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత అది ఫ్లాప్ అవుతుందని ఊహించారు. కానీ దర్శక నిర్మాతలను కాదనలేక ఫ్లాప్ అవుతుందని తెలిసినప్పటికీ, ఆ సినిమాలో నితిన్ నటించడం ఎంతో గొప్ప అని నితిన్ గురించి చెప్పుకొచ్చాడు. ఏ మాత్రం గర్వం కనిపించనీయకుండా, అందరిలోనూ కలుపుకుంటూ పోతాడని, మంచి వ్యక్తిత్వం కలవాడని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు..