బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిగా ఎంత పేరు తెచ్చుకున్నారో.. అంతకంటే ఎక్కువగా విమర్శలతో హైలెట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ విమర్శలు మరియు వివాదాలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కంగనా రనౌత్... ఇప్పుడు తాజాగా ఓ డైరెక్టర్ ని పొగుడుతూ ... ఆయనను ప్రశంసలతో ముంచెత్తింది. ప్రశంసించడం వరకు సరే ఏకంగా ఆ దర్శకుడి ని దేవునితో పోల్చడం విశేషం.