ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని కూడా చేజిక్కించుకున్నారు అని వార్తలు గుప్పుమంటున్నాయి. మహేష్ బాబు కోసం అనిల్ రావిపూడి ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు అనిల్ రావిపూడి కి ఫోన్ చేసి కృతి శెట్టి ని హీరోయిన్ గా తీసుకుందామని అడిగారట. అందుకు అనిల్ రావిపూడి కూడా అంగీకరించినట్టు సన్నిహిత వర్గాల సమాచారం.