అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం హిందీలో చేసిన సినిమా ముంబై సాగా గ్యాంగ్ స్టర్ వర్సెస్ సీరియస్ కాప్ డ్రామా గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మధ్య కాలంలో హిందీలో ఈ తరహా చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. జాన్ అబ్రహాం, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పోలీసు పాత్రలో ఇమ్రాన్ హస్మి హీరోకి ప్రత్యర్థి పాత్రలో నటించారు.