తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురు, శుక్రవారాల్లో ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో కోసం ప్రజలు వేచి చూస్తుంటారు. ఎంతో మంది కమెడియన్లు వివిధ రకాల స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు పరిచయమయ్యారు. ప్రేక్షకుల ఆదరణ పొంది బుల్లితెర నుంచి సినీ పరిశ్రమలో కూడా అడుగులు వేశారు.