మాతృదేవోభవ, ఆ నలుగురు, ఆపద్బాంధవుడు, నిరీక్షణ,రాజా, సుస్వాగతం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, గమ్యం, మిధునం, సింహరాశి వంటి ఎన్నో చిత్రాలు మనసుని బాగా హత్తుకునేలా ఉన్నాయి. అంతే కాకుండా నిజజీవితంలో జరిగే కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రాలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నాయి.