పూర్వ కాలంలో అంటే బ్లాక్ అండ్ వైట్ సినీ కాలంలో... చారిత్రాత్మక సినిమాలు తీయడం పెద్ద కష్టమేమీ కాదు, ఎక్కువగా ఆర్ట్ ను ఉపయోగించి ఇటువంటి సినిమాలు తీసేవారు. అవి అప్పటి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. కానీ ఇప్పుడున్న సినీ పరిశ్రమలో రంగురంగుల లోకం మొదలయింది. ఇప్పట్లో చారిత్రాత్మక కథను తెరకెక్కించడం అంటే అంత సులభమేమీ కాదు.... బడ్జెట్ కూడా భారీగానే ఖర్చవుతుంది.