తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. అయితే కొన్ని సినిమాలు హిట్ ఫ్లాప్ అనే ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2004లో విడుదలైన అంజి సినిమా ఒకటి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.