తెలుగు సినీ పరిశ్రమలో వారసులు రావడం కొత్తేమీకాదు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల, దర్శకుల, నిర్మాతల కొడుకులు, కుమార్తెలు సినీ పరిశ్రమకు పరిచయమై మంచి పేరును కూడా సొంతం చేసుకున్నారు. హీరోలుగా, దర్శకులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఇలా సినీ పరిశ్రమకు పరిచయమై.. తమదైన శైలిలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన వారి సంఖ్య ఎక్కువే ఉంది.