ర్డు ప్రముఖ తమిళ దర్శకుడు జాతీయ అవార్డు విజేత అయిన డైరెక్టర్ ఎస్ పి జననాధన్ కన్నుమూశారు. 61 సంవత్సరాలు కలిగిన జననాధన్ గత కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ హెమరేజ్ అవ్వడంతో అకస్మాత్తుగా వారు నివసిస్తున్న ఇంట్లో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే జననాధన్ ను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ దురదృష్టవశాత్తు డాక్టర్ లు ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా, ఆయన ఆ ట్రీట్మెంట్ కు స్పందించక ఆదివారం (మార్చ్ 14 2021)ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది.ప్రస్తుతం విజయ్ సేతుపతి తో "లాభం" అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది .ఇక ఈ సినిమా ఎడిటింగ్ దశలో ఉంది. ఇక ఈయన హఠాత్మరణం తో తమిళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు ఏర్పడింది.