ఒకప్పుడు అగ్ర దర్శకుడుగా మాస్ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. అయితే తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో గొప్ప విజయాలు అందించిన ఈ డైరెక్టర్ కి ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తూనే వచ్చాడు. అయితే ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఘన విజయాన్ని సాధించి మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు ఈ దర్శకుడు.