భానుప్రియ సితార సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి దర్శకుడు వంశీ. వంశీ, భానుప్రియ ప్రేమలో కూడా పడ్డారు. అయితే భానుప్రియ తల్లిగారు వీరి ప్రేమను అంగీకరించలేదు.. ఇందుకు కారణం వంశీకి అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.1998 లో కౌశల్ అనే ఎన్నారైను పెళ్లిచేసుకుని, అమెరికా వెళ్లి స్థిరపడింది. వీరికి ఒక పాప కూడా జన్మించింది. కొంతకాలానికి భానుప్రియ భర్త చనిపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురి అయి, కోలుకుంటున్న సమయంలోనే తల్లిగారు కూడా చనిపోయారు. అలాగే ఇంట్లో ఒక మైనర్ బాలికను పనికి పెట్టుకున్నారని ఆమెపై కేసు కూడా పడింది. ఇలా వరుస బాధలు, ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. అయితే ఇప్పుడు వంశీ, భానుప్రియ ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది..