ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన తమ్ముడు మనోజ్ విడాకుల గురించి స్పందిస్తూ.. వాడి పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అనుకోలేదు. జీవితంలో అన్ని అనుకున్నట్లుగా జరుగవు. కొన్ని సార్లు అనుకున్నట్లుగా కాకుండా వేరేలా జరుగుతుంటాయి. అంతా బాగా అవుతాయని భావిస్తాం. కాని అలా కొన్ని సార్లు జరుగవు. వాటిని మర్చి పోయి ముందుకు వెళ్లి పోవడం తప్ప ఏం చేయలేం అన్నాడు.