ముందు మహేష్, ఒక బాలీవుడ్ దర్శకులతో పని చేయబోతున్నట్లు సమాచారం. అయితే ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు. ఇందులో భాగంగానే కరణ్ జోహార్ మహేష్ బాబు తో ఒక సినిమాను తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంచుకున్నారట. ఇకపై ఎలాగో దర్శకుడు రాజమౌళితో పాన్ ఇండియా మూవీ మహేష్ బాబు చేయబోతున్నాడు. ఇక పై బాలీవుడ్ లో ఇలాంటి ఒక సినిమా తీస్తే, మంచి ప్రయోజనం ఉంటుందనే ఆలోచనతో ఈ సినిమాకు ఓకే చెప్పాడట..