1994లో మలయాళంలో వచ్చిన తేన్మావిన్ కొంబత్ ఆధారంగా ఒక కొత్త సబ్జెక్టును తయారు చేయమని రజినీకాంత్ కె.ఎస్.రవికుమార్ ను ప్రోత్సహించాడు. ఇక ఈ చిత్రంలో యజమాని తో పాటు పని వాడు కూడా ఒక అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం రజినీకాంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా కోసం అప్పట్లో ఐదు వేల మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకోవడం రికార్డు సృష్టించింది. అయితే అప్పటి దాకా మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా, దేవా లను తప్ప, ఇంకెవరిని ఇష్టపడిన రజినీకాంత్ మొదటిసారి ఏ ఆర్ రెహమాన్ కు అప్పగించాడు. ఏ ఆర్ రెహమాన్ కూడా రజినీకాంత్ ను దృష్టిలో పెట్టుకొని సంగీతం అనువదించాడు. ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఇక ఇందులోని పాటలు ఇప్పటికీ లవర్స్ కు ఫేవరెట్ గానే నిలిచాయి..