పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని చేసుకున్న సినిమా వకీల్ సాబ్. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ పూర్తయింది, నిర్మాతలు హ్యాపీ. అటు భారీ రెమ్యునిరేషన్ తో హీరో కూడా హ్యాపీ. మరి ఫ్యాన్స్ సంగతేంటి. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న వకీల్ సాబ్ గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు. విడుదల తేదీ దగ్గరపడినా ఇంకా సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ ని సంతోషపెట్టే అంశమేదీ బయటకు రాలేదా? అవుననే అంటున్నారు అభిమానులు. సినిమాపై బజ్ పెరగలేదని, మంచి స్టఫ్ ఉన్న మెటీరియల్ ఇంకా వదలలేదని ఫీలవుతున్నారు.