చిత్ర పరిశ్రమలో లోక నాయకుడు కమల్ హాసన్ గురించి తెలియని వారంటూ లేరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం,కొందరు పార్టీలు పెట్టడం అన్ని భాషా రంగాల్లోనూ ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పార్టీ పెట్టి ప్రస్తుతం తమిళనాట జరిగే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.