చిరంజీవి నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ఆచార్య తర్వాత చిరంజీవి చేస్తున్న లూసిఫర్ రీమేక్ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్తుంది. జనవరి నెలలో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. సినిమా షూటింగ్ చకచకా పూర్తి చేయాలని దర్శకుడు మోహన్ రాజాకు చిరంజీవి టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది.