దగ్గుబాటి నట వారసుడు రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా ‘విరాట పర్వం’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా 90వ దశకంలో తెలంగాణలోని నక్సల్ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్ లైన్తో రానున్న ఈ సినిమా ప్రేమ, విప్లవం అనే కథాంశంతో రానుంది.