జనవరి 7వ తేదీన విడుదలైన కేజిఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ ఇప్పటివరకు 17 కోట్ల 50 లక్షల వ్యూస్ సంపాదించింది. ఈ ట్రైలర్ కి 8 కోట్ల లైకులు రావడం మరో విశేషం. అలాగే ఈ ట్రైలర్ కి ఏడు లక్షల కామెంట్లు వచ్చాయి. 7 లక్షల కామెంట్స్ అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఏ సినిమా ట్రైలర్ కూడా ఈ స్థాయిలో వ్యూస్ గానీ లైక్స్ గానీ కామెంట్స్ గాని పొందలేదు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన ట్రైలర్ గా కేజిఎఫ్ చాప్టర్ 2 నిలిచింది.