కమల్ హాసన్ తర్వాత వివిధ భాషల్లో నటించిన ఏకైక నటుడు విజయ్ సేతుపతి. తమిళ్‌తో పాటు మలయాళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్నాడు.తన జీవిత కాలంలో నేర్చుకోగలిగినంత తాను నేర్చుకోవాలనుకుంటున్నానని విజయ్ సేతుపతి తెలిపారు. చాలా మంది తనకు హిందీ రాదనుకుంటారని.. కానీ తాను హిందీని అర్థం చేసుకోవడంతో పాటు కొంత వరకూ మాట్లాడగలనని విజయ్ సేతుపతి వెల్లడించారు.