మంచు విష్ణు నటిస్తున్న సినిమాకు పెద్దగా బజ్ లేకపోవడం ప్రేక్షకులను సినిమా థియేటర్ల వైపు మళ్ళించడానికి కూడా కష్టంగా ఉంది.కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం,చావుకబురు చల్లగా, ఈ సినిమాకి సౌండ్ అంత గట్టిగా ఏమి వినబడటం లేదు.ఆది సాయి కుమార్ కొత్త సినిమా' శశి ' కూడా కేవలం ఒక్క పాట వైరల్ కావడం వల్ల కొద్దిపాటి అంచనాలు తెచ్చుకుంది. ఒకవేళ కంటెంట్ బాగుంటే సేఫ్ అవుతుంది. అది కూడా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఇవన్నీ 19న విడుదల అవుతున్నాయి. అయితే వీటి ఫలితాలు ఎలా వస్తాయో వేచి చూడాల్సిందే..