నారప్ప సినిమాని మే 14వ తేదీన విడుదల చేస్తామని సినీ బృందం ప్రకటించింది కానీ నిర్మాత సురేష్ బాబు రిలీజ్ డేట్ విషయంలో పునరాలోచిస్తున్నారని తెలుస్తోంది. మే నెల 13వ తేదీన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో మెగా హీరో సినిమాతో పోటీకి దిగితే అసురన్ రీమేక్ తట్టుకోలేక పోవచ్చునని వెంకటేష్ కూడా భావిస్తున్నారు. 2 సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఓపెనింగ్స్ విషయంతోపాటు స్క్రీన్ షేరింగ్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చిత్రబృందం అభిప్రాయపడుతోంది.