భలే భలే మగాడివోయ్ సినిమాలో నాని ని మతిమరుపు వ్యక్తిగా చూపిస్తే ప్రేక్షకులు భలే థ్రిల్ అయ్యారు. మహానుభావుడు సినిమాలో శర్వానంద్ ని అతి శుభ్రత పాటించే వ్యక్తిగా చూపిస్తే.. అది కూడా హిట్టయింది. అదే కోవలో రవితేజను బ్లైండ్ పర్సన్ గా పెట్టి రాజా ది గ్రేట్ తీస్తే అది కూడా వర్కవుట్ అయింది. దీంతో ఇలాంటి క్యారెక్టర్స్ ని హైలెట్ చేస్తున్నారు దర్శకులు. తమ సృజనాత్మకతకు పని పెడుతున్నారు. ఈ కోవలోనే ఇప్పుడు వెంకటేష్ ని రేచీకటి ఉన్న వ్యక్తిగా చూపిస్తున్నారు. హిట్ సెంటిమెంట్ కోసమే యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇలా వెంకేటష్ క్యారెక్టర్ తీర్చిదిద్దారట.