కాజల్ అగర్వాల్ తొలిసారిగా నాగార్జునతో కలిసి నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ ఎల్ పి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్రముఖ నిర్మాత లైన నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ కుమార్ కలిసి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ..నాకు చిన్నప్పటి నుంచి నాగార్జునగారు అంటే ఎనలేని అభిమానం. ఇప్పుడు ఆయనతో కలిసి నటించబోతున్న అందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది..